‘మందాడి’కి ట్రేడ్ వర్గాల్లో భారీ డిమాండ్.. కానీ మూవీ టీమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Chukka Sudharani |

తన తొలి చిత్రం ‘సెల్ఫీ’తో తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మతిమారన్ పుగళేంది రచన, దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం ‘మందాడి’.

‘మందాడి’కి ట్రేడ్ వర్గాల్లో భారీ డిమాండ్.. కానీ మూవీ టీమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, సినిమా: తన తొలి చిత్రం ‘సెల్ఫీ’తో తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మతిమారన్ పుగళేంది రచన, దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం ‘మందాడి’. సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీతో తెలుగు హీరో సుహాస్ తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌లో 16వ ప్రాజెక్టుగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు అన్నీ అప్డేట్స్ కూడా సినిమాపై అంచాలు భారీగా పెంచేశాయి. దీంతో రిలీజ్ డేట్ ఫిక్స్ కాకముందే ఈ సినిమా ట్రేడ్ వర్గాల్లో భారీ డిమాండ్‌ను చూస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ఆంధ్రప్రదేశ్/తెలంగాణ అండ్ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను దక్కించుకోవడానికి భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ మందాడి నిర్మాతలు మాత్రం వేరే వ్యూహం వేస్తున్నట్లు టాక్. హక్కులను అమ్మడానికి బదులుగా, భారతదేశం అంతటా విడుదల చేయాలనే లక్ష్యంతో, సొంత పంపిణీ విధానానికి ప్రణాళిక వేస్తోందట చిత్ర బృందం. ఫైనల్‌గా థియేట్రికల్ హక్కులపై స్పష్టత రావాల్సి ఉంది.

Next Story