సెన్సేషనల్ హిట్ ‘బిచ్చగాడు’ కాంబో రిలీజ్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మంచు విష్ణు

by Chukka Sudharani |

విజయ్ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వస్తున్న ‘వంద దేవుళ్లు’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మంచు విష్ణు.

సెన్సేషనల్ హిట్ ‘బిచ్చగాడు’ కాంబో రిలీజ్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మంచు విష్ణు
X

దిశ, సినిమా: విజయ్ ఆంటోని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘బిచ్చగాడు’. శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2016 రిలీజై మంచి సక్సెస్‌ను అందుకుంది. తన తల్లి ప్రాణాల కోసం ఓ బిలియనీర్ 48 రోజుల పాటు బిచ్చగాడిగా మారే కథాంశంతో, భావోద్వేగాలతో ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిగా ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో విజయ్ ఆంటోని, డైరెక్టర్ శశి కాంబోకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఇన్నేళ్లకు ఈ కాంబో మరోసారి పట్టాలెక్కుతోంది. విజయ్ ఆంటోని, డైరెక్టర్ శశి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘నూరు సామి’. ఇది తెలుగులో ‘వంద దేవుళ్లు’గా రాబోతున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో మంచు విష్ణు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ‘ఇది నిజమైన భావోద్వేగాలతో కూడిన కుటుంబం యొక్క ప్రయాణం. వారు జీవించిన జీవితం ఇదే. వందదేవుళ్లు ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పోస్టర్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది .. విజయ్ఆంటోనీ, దర్శకుడు శశి, హీరోయిన్ స్వాసిక అండ్ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’ అని తెలిపాడు. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Next Story