కన్నప్ప ట్రైలర్ విడుదల.. స్పెషల్ హైలైట్‌గా ప్రభాస్, మంచు విష్ణు ఫైట్ (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-14 13:58:04  IST  )

సినిమా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న కన్నప్ప ట్రైలర్(Kannappa Trailer) వచ్చేసింది.

కన్నప్ప ట్రైలర్ విడుదల.. స్పెషల్ హైలైట్‌గా ప్రభాస్, మంచు విష్ణు ఫైట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న కన్నప్ప ట్రైలర్(Kannappa Trailer) వచ్చేసింది. ‘దేవుడు లేడు’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ అందరనీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో చూపించిన ప్రభాస్, మంచు విష్ణు(Manchu Vishnu) మధ్య ఫైట్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని తెలుస్తోంది. కాగా, కన్నప్ప చిత్రం మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్. ఇందులో విష్ణు శివ భక్తుడైన కన్నప్ప పాత్రలో నటించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), మోహన్‌లాల్‌ (Mohanlal), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) తదితర స్టార్‌ హీరోలు కీలక పాత్రలు పోషించారు. తిన్నడుగా విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్‌, శివుడిగా అక్షయ్‌కుమార్‌ నటించారు. ‘మహాభారతం’ సీరియల్‌ ఫేమ్‌ ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 27న (Kannappa Release Date) రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

Next Story