Manchu Vishnu: మంచి మనసు చాటుకున్న మంచు విష్ణు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

by Chukka Sudharani |   (  Updated:2025-01-13 14:17:49  IST  )

హీరో మంచు విష్ణు (Manchu Vishnu)పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Manchu Vishnu: మంచి మనసు చాటుకున్న మంచు విష్ణు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: హీరో మంచు విష్ణు (Manchu Vishnu)పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తిరుపతి (Tirupati)లోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఉండే మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను విష్ణు దత్తత తీసుకున్నారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. ‘కుడి చెయ్యి చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అనుకుంటారు. కానీ ఈ సంక్రాంతికి నేను చేసిన ఓ చిన్న పని మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని విని ఇంకొంతమంది ఆదర్శంగా తీసుకుని పక్కనున్నవారికి సహాయం చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. తిరుపతిలోని బైరాగిపట్టెడ (Bairagipatteda) ప్రాంతంలో ఉండే మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను నేను దత్తత తీసుకున్నాను. వాళ్లకు అప్పడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాము. అలాగే వారి విద్యాకు సంబంధించి పూర్తి బాధ్యత కూడా మాదే. వాళ్లు కూడా నా కుటుంబ సభ్యులే అని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి పండుగకు వాళ్లతో గడపాలి అనుకున్న. అందుకే ఈ సంక్రాంతికి ఇక్కడికి వచ్చాను. వాళ్లకు ఒక అన్నగా, ఇంటి పెద్దగా నేను ఉన్నాను.. నేను చూసుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతుండగా.. విష్ణుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెలిజన్లు.

Next Story