Manchu Family: మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న హైడ్రామా.. డీజీపీ ఆఫీసుకు మనోజ్

by Gantepaka Srikanth |   (  Updated:2024-12-10 15:45:37  IST  )

మంచు ఫ్యామిలీ(Manchu Family)లో హైడ్రామా కొనసాగుతోంది.

Manchu Family: మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న హైడ్రామా.. డీజీపీ ఆఫీసుకు మనోజ్
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు ఫ్యామిలీ(Manchu Family)లో హైడ్రామా కొనసాగుతోంది. మంగళవారం తనకు న్యాయం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులను రిక్వెస్ట్ చేసిన మంచు మనోజ్(Manchu Manoj) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని డీజీపీ(Telangana DGP) కార్యలయానికి వచ్చారు. తనకు న్యాయం చేయాలని కంప్లైంట్ చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను డీజీపీ(DGP)కి సమర్పించారు. అంతేకాదు.. ఫిర్యాదులో మనోజ్ కీలక అంశాలను ప్రస్తావించారు.

గత ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో పది మంది వ్యక్తులు.. తనపై బెదిరింపులకు దిగారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోకి ప్రవేశించి తననే ఇంట్లో ఉండొద్దని బెదిరింపులకు గురిచేశారని వెల్లడించారు. తాను షూటింగ్‌కు వెళ్లి ఉంటానని భావించి, ఇంట్లోకి చొరబడ్డారని తెలిపారు. నా భార్యను, పిల్లలను చంపేస్తామని బెదిరింపులకు దిగారని కంప్లైంట్‌లో మనోజ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే మనోజ్ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబుపై.. మోహన్ బాబు(Mohan Babu) ఫిర్యాదు ఆధారంగా మనోజ్‌పై కేసులు నమోదు అయ్యాయి.

Read More...

జల్‌పల్లి మోహన్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ


Next Story