- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోటల్‌లో అలాంటి అనుభవం.. మంచు లక్ష్మి ఫైర్
ఓ హోటల్ లో ఎదురైన చేదు అనుభవాన్ని టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్ లో ఎదురైన అనుభవంతో తాను నిరాశ చెందినట్టు చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్: ఓ హోటల్ లో ఎదురైన చేదు అనుభవాన్ని టాలీవుడ్ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్ లో ఎదురైన అనుభవంతో తాను నిరాశ చెందినట్టు చెప్పింది. తాను ప్రపంచం మొత్తం తిరిగానని కానీ ఇలాంటి రూల్స్ ఎక్కడా చూడలేదని మండిపడింది. హోటల్ లోకి తన కెమెరా మెన్ ను అనుమతించలేదని చెప్పింది. కెమెరాలకు హోటల్ రూంలోకి అనుమతించమని చెప్పారని మేనేజర్ ప్రవర్తన కూడా దురుసుగా ఉందని తెలిపింది.
సిబ్బంది ప్రవర్తన సైతం అలానే ఉందని మండిపడింది. కెమెరాలను అనుమతించం అని తనకు ఎక్కడా ప్రకటనలు కూడా కనిపించలేదని తెలిపింది. అంతే కాకుండా అనుమతించకపోవడంతో ఏం చేయాలని ప్రశ్నించగా దానికి కూడా సమాధానం ఇవ్వలేదని చెప్పింది. అయితే ఇది వరకు తన స్టైలిష్ ఇదే హోటల్ లో దిగిన ఫోటోలు చూపించడంతో అనుమతించారని చెప్పింది. ఇది అతిథులను గౌరవించే విధానం కాదని మండిపడింది. గ్రీన్ పార్క్ హోటల్స్ అంటే తనకు ఎంతో అభిమానం అని కానీ ఇక్కడే ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పింది. దీనిపై యాజమాన్యం స్పందించి మళ్లీ ఇలాంటివి జరగకుండా చూడాలని కోరింది.






