- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంత బాధపడ్డానో నాకే తెలుసు.. కుటుంబంలో గొడవలపై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు
గత కొద్దిరోజులో మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా మీడియా ముందుకే వచ్చి మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు, విష్ణుపై ఆరోపణలు చేశారు. దీంతో మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరినట్టు క్లారిటీ వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్దిరోజులో మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా మీడియా ముందుకే వచ్చి మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు, విష్ణుపై ఆరోపణలు చేశారు. దీంతో మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరినట్టు క్లారిటీ వచ్చింది. ఇక ఈ గొడవలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు.
దేవుడు కనిపించి ఓ వరం కోరుకోవాలని అంటే తన కుటుంబం అంతా మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటానని చెప్పారు. కుటుంబాల్లో గొడవలు సహజం అని కానీ మనకు చివరకు మిగిలేది రక్త సంబంధీకులే అని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి అన్నారు. ఫ్యామిలీతో కలిసి ఉండటానికి ఎన్ని పోరాటాలు అయినా చేయాలి కానీ దూరాన్ని పెంచుకోకూడదన్నారు. తాను ముంబాయిలో ఉంటానని ఇక్కడి విషయాలు తెలిసినా వాటి గురించి బాధపడను అని కొంతమంది వార్తలు రాశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఎంత బాధపడ్డానో తనకే తెలుసని చెప్పారు. వివాదం గురించి ఏమీ మాట్లాడలేదు కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్లు రాసుకున్నారని మండిపడ్డారు. ఇలాంటి వివాదాలు వస్తాయని అనుకోలేదని, తన కుటుంబం గురించి ఎంత బాధపడ్డానో తనకే తెలుసున్నారు. తన బాధ గురించి బయటివాళ్లకు తెలియాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.






