'మన శంకరవరప్రసాద్ గారు' ట్రైల‌ర్ కు ముహుర్తం ఫిక్స్‌..ఎప్పుడంటే

by velandi.Saikiran |

మన శంకర వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ ను జనవరి 4వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

మన శంకరవరప్రసాద్ గారు ట్రైల‌ర్ కు ముహుర్తం ఫిక్స్‌..ఎప్పుడంటే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో దూసుకు వెళ్తోంది. హీరోయిన్ నయనతారను కూడా బరిలోకి దించి అనిల్ రావిపూడి ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ ను జనవరి 4వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తిరుపతిలో ఈ ఈవెంట్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి ఈ ట్రైలర్ లాంచ్ చేసేందుకు అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నారట. కాగా చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Next Story