- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవికి షాక్...24 గంటల్లోనే 'MSVPG' పైరసీ !
మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఆన్లైన్ లో ప్రత్యక్షమైనట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవికి ఊహించని షాక్ తగిలింది. ఆయన నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఆన్లైన్ లో ప్రత్యక్షమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయి 24 గంటలు అయ్యేలోపు పైరసీ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ న్యూస్ బయటకు రాగానే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిరంజీవి అంటే పడని వాళ్ళు ఈ పని చేసి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
84 కోట్లు వసూలు చేసిన చిరంజీవి మూవీ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా కలెక్షన్స్ లో దూసుకు వెళ్తోంది. ఈ సినిమా ఒక్కరోజులోనే ప్రీమియర్లతో కలిపి ఏకంగా 84 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిందట. ఈ మేరకు చిత్ర బృందం కూడా పేర్కొంది. కాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేయగా, విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు. అటు హీరోయిన్ గా నయనతార మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని దర్శకుడు అనిల్ బాగా వాడుకున్నాడని.. దీంతో సినిమా బంపర్ హిట్ కాబోతోందని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.
Read More..






