సినిమా ఫైనల్ కాపీ చూసి ఎంతో ఏడ్చాను.. మమితా వైరల్ కామెంట్స్

by Chukka Sudharani |

యంగ్ హీరోయిన్ మమితా బైజు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది.

సినిమా ఫైనల్ కాపీ చూసి ఎంతో ఏడ్చాను.. మమితా వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మమితా బైజు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ‘ప్రేమలు’ సినిమాతో తమిళం, కన్నడ, తెలుగులో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం.. ఇరుందు వానం, జననాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్ తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ అమ్మడు పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న వరుస చిత్రాల నుంచి స్పెషల్ పోస్టర్లు రిలీజ్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. మమిత నటిస్తున్న ‘ఇరుందువానం’ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా.. రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీకి తనో ఎంతో కనెక్ట్ అయినట్లు చెప్పుకొచ్చింది. ‘నేను నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు రామ్‌కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘ఇరుందువానం’ ఒకటి. ఈ సినిమా ఫైనల్ కాపీ చూస్తున్నప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. గత మూడేళ్లుగా మేము ఈ సినిమా కోసం పని చేస్తున్నాము. ఈ ప్రయాణంలో మేము ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాము. ఆ కష్టాలన్నింటినీ దాటి, పూర్తయిన సినిమాను చూస్తున్నప్పుడు నాకు చాలా భావోద్వేగం కలిగింది, దాంతో నేను ఎంతో ఏడ్చాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story