గుడ్ న్యూస్ ప్రకటించిన మాళవిక.. అతడితో ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

మోడల్ మాళవిక రాజ్(Malvika Raj) అందరికీ సుపరిచితమే. పలు సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించిన ఆమె ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

గుడ్ న్యూస్ ప్రకటించిన మాళవిక.. అతడితో ఉన్న ఫొటోలు షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: మోడల్ మాళవిక రాజ్(Malavika Raj) అందరికీ సుపరిచితమే. పలు సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించిన ఆమె ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఈ అమ్మడు నటనపై ఆసక్తితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాళవిక ‘కబి కుషి కబి గమ్’(Kabi Kushi Kabi Gum) సినిమాలో నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఈనేపథ్యంలో.. ఆమె ప్రణవ్ బగ్గాను పెళ్లి చేసుకుంది. వీరిద్దరు పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మాళవిక తాను తల్లి కాబోతున్నట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలు ఫొటోలు షేర్ చేసింది. వైట్ కలర్ దుస్తుల్లో తన భర్తతో కలిసి ఫొటోషూట్ చేసిన ఆమె ప్రెగ్నెన్సీ కిట్ చూపిస్తూ.. మామ్ అని రాసి ఉన్నా క్యాప్ ధరించింది. ఇక ఆమె భర్త డాడ్ అని టోపీ పెట్టుకుని మాళవికను ఎత్తుకున్నాడు. ప్రస్తుతం ఈ అమ్మడు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story