- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gymkhana: తెలుగులోకి మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
మలయాళం(Malayalam)లో రిలీజై మంచి హిట్ అందుకున్న సినిమాలు.. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా సక్సెస్ సాధిస్తున్నాయి.

దిశ, సినిమా: మలయాళం(Malayalam)లో రిలీజై మంచి హిట్ అందుకున్న సినిమాలు.. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా సక్సెస్ సాధిస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఇప్పటికే వచ్చిన ‘ప్రేమలు’ (Premalu), ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummal Boys) చిత్రాలు మలయాళంతో పాటు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో మరో మలయాళ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ ‘అలప్పజ జింఖానా’(Alappaja Gymkhana). స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్(Sports backdrop)లో తెరకెక్కిన ఈ చిత్రానికి జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరీలు కలిసి నిర్మించగా.. ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించాడు. నస్లెన్‌తో పాటు లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన ఈ మూవీ రీసెంట్‌గా మలయాళంలో రిలీజై బాక్సాఫీస్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగులో ‘జింఖానా’ (Gymkhana) అనే పేరుతో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటిస్తూ.. ఏప్రిల్ 25న థియేటర్‌లలో సందడి చేయనున్నట్లు తెలిపారు.
7 DAYS To Go#GymkhanaTelugu in cinemas on April 25th, 2025 #Gymkhana pic.twitter.com/ikiIcxtRt2
— Vamsi Kaka (@vamsikaka) April 18, 2025






