Malavika Mohanan: స్టార్ హీరో సినిమా ఆఫర్ అయినా పాత్ర నచ్చకపోతే చెయ్యను.. హీరోయిన్ మాళవిక మోహనన్ కామెంట్స్

by Chukka Sudharani |

రీసెంట్‌గా ‘హృదయపూర్వం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న హీరోయిన్ మాళవిక మోహనన్.

Malavika Mohanan: స్టార్ హీరో సినిమా ఆఫర్ అయినా పాత్ర నచ్చకపోతే చెయ్యను.. హీరోయిన్ మాళవిక మోహనన్ కామెంట్స్
X

దిశ, సినిమా: రీసెంట్‌గా ‘హృదయపూర్వం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న హీరోయిన్ మాళవిక మోహనన్.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పెద్ద సినిమాల్లో కాదు.. పాత్ర బలంగా ఉన్నా సినిమాలు చేయాలని ఉందటూ చెప్పుకొచ్చింది. ‘ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఎవరైనా స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ సినిమాలో చాన్స్ వస్తే చేయాలి అనుకుంటారు. అలా చేస్తే కెరీర్‌లో తొందరగా ఫేమ్ వస్తుందని భావిస్తారు. కానీ కాలక్రమేనా ఆ ఆలోచనలో మార్పు వస్తుంది. నేను మొదట్లో అలాగే అనుకునే దాన్ని.

కానీ ఇప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో గుర్తిండిపోయే పాత్రలు చేస్తూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటున్నా. పెద్ద సినిమాలో ఆఫర్ వస్తే జాయిన్ కావచ్చు కానీ.. అది గుర్తింపు లేని పాత్ర అయితే ప్రేక్షకులు మనల్ని అంగీకరించరు. అందుకే అవకాశాలు రావడం కాస్త ఆలస్యం అయినా మంచి కథ ఎంచుకుని, స్ట్రాంగ్ పాత్రతో ప్రేక్షకులను అలరించాలి అనుకుంటున్నా. బాలీవుడ్‌లో కూడా అలాంటి కథలనే ఎంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా’ అని తెలిపింది మాళవిక. ప్రజెంట్ మాళవిక మోహనన్ చేతిలో ప్రభాస్ ‘రాజాసాబ్’, కార్తీ ‘సర్దార్ 2’ వంటి చిత్రాలు ఉన్నాయి.

Next Story