- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వారణాసి’ టీజర్ పై బిగ్ అప్డేట్...ఎప్పుడంటే !
ప్రిన్స్ మహేష్ బాబు -జక్కన్న దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. దాదాపు 1300 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా చిన్నపాటి మూవీ టీజర్ ను వదలాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట.

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు -జక్కన్న దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. దాదాపు 1300 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, పృథ్వీరాజ్ లాంటి కీలక నటీనటులు కూడా ఇందులో ఉండనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్ వదిలిన చిత్ర బృందం అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా చిన్నపాటి మూవీ టీజర్ ను వదలాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం విదేశాల్లో స్పెషల్ ఈవెంట్ నిర్వహించి, రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారట. ఈ ఈవెంట్ లో ప్రిన్స్ మహేష్ బాబు కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయని అంటున్నారు. కాగా ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.






