- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kingdom: విజయ్ దేవరకొండకు మహేష్ బాబు చెక్...!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda) లేటెస్ట్ గా చేసిన సినిమా కింగ్డమ్ ( Kingdom). ఈ సినిమాలో భాగ్య

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda) లేటెస్ట్ గా చేసిన సినిమా కింగ్డమ్ ( Kingdom). ఈ సినిమాలో భాగ్య శ్రీ ( Bhagya Shree) హీరోయిన్ గా నటించగా... సత్యదేవ్ ( Sathyadev ) కీలక పాత్రలో కనిపించారు. జులై 31వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా... మంచి కలెక్షన్స్ రాబడుతోంది. 130 కోట్లతో తీసిన ఈ సినిమాకు... కలెక్షన్స్ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ సినిమా ఆరు రోజులు పూర్తయ్యేసరికి... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 94 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చెబుతున్నారు. మరో రెండు రోజులయితే ఈ సినిమా లాభాల బాటలో పడనుందని అంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో విజయ్ దేవరకొండకు మహేష్ బాబు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.
మహేష్ బాబు కెరియర్ లో భారీ విజయాన్ని నమోదు చేసిన అతడు సినిమా... రీ రిలీజ్ కాబోతోంది. ఈ వారం చివర్లోనే అంటే ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా వస్తోంది. అయితే రీ రిలీజ్ అయిన సినిమాలకు కలెక్షన్స్ పెద్దగా రావు. కానీ మహేష్ బాబు నటించిన అతడు సినిమా మాత్రం.. కచ్చితంగా కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమాను టీవీలో చాలామంది చూస్తూ ఉంటారు. భైరవం సినిమా నడుస్తున్న సమయంలోనే ఖలేజా సినిమా రీ రిలీజ్ అయి... ఆ చిత్ర బృందానికి షాక్ ఇచ్చింది. ఇక కింగ్డమ్ సినిమా నడుస్తున్న నేపథ్యంలోనే అతడు వస్తోంది. అందుకే విజయ్ దేవరకొండకు కొత్త టెన్షన్ మొదలైంది. మరి కింగ్డమ్ దూకుడును మహేష్ ఆపుతారా? లేదా? అనేది చూడాలి.






