మగాడిపై జాలి పడేదెవ్వడు.. ఆకట్టుకుంటున్న సాంగ్

by Sujitha Rachapalli |

ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో టచ్ చేస్తూ తీస్తున్న చిత్రం ‘పురుష:’. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు.

మగాడిపై జాలి పడేదెవ్వడు.. ఆకట్టుకుంటున్న సాంగ్
X

దిశ, సినిమా : ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో టచ్ చేస్తూ తీస్తున్న చిత్రం ‘పురుష:’. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం థీమ్ సాంగ్ .. ‘జాలి పడేదెవ్వడు.. మగాడి మీద జాలి పడేదెవ్వడు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను ఎం. ఎం. కీరవాణి అద్భుతంగా ఆలపించగా.. శ్రవణ్ భరద్వాజ్ ఇచ్చిన క్యాచీ ట్యూన్ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ సినిమా కథను వివరించేలా, కథనాన్ని అందరికీ ముందే చెప్పినట్టుగా ఉన్నాయి. ఎంతో ఫన్నీగా సాగిన ఈ లిరిక్స్ భార్యాభర్తల మధ్య బంధాన్ని వివరించాయి.

Next Story