- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్ నుంచి దివ్వెల మాధురి ఔట్!
తెలుగు బిగ్ బాస్ హౌసులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక.. ఆట తీరే మారిపోయింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు బిగ్ బాస్ హౌసులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక.. ఆట తీరే మారిపోయింది. వరుస టాస్కులే కాకుండా.. హౌసులో జరిగే గొడవలు, అల్లరి చేష్టలు ప్రేక్షకులని ఇంట్రెస్టింగ్ గా టీవీల ముందు కట్టి పడేస్తోంది షో. అయితే ఈరోజు మరో ఎలిమినేషన్ జరిగినట్టు సమాచారం. ఈ వారం డేంజర్ జోన్ లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఉండగా టాప్ ఓటింగ్ లో తనూజ, కళ్యాణ్ దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వారం ఎలిమినేషన్ ఎవరనే న్యూస్ బయటకు వచ్చింది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి దివ్వెల మాధురి ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఫైర్ బ్రాండ్ లా ఇంట్లోకి అడుగుపెట్టి, రావడంతోనే పేరు తెలియదు అని చెప్పడంతో శ్రీజపై ఫైర్ అయ్యింది. ఆ తర్వాత తనూజ-కళ్యాణ్, రీతూ-పవన్ బాండింగ్స్ పై కామెంట్స్ చేసింది. హౌస్ లో ప్రతి విషయానికి రచ్చ చేయడంతో తీరు మార్చుకోమని నాగ్ హెచ్చరించారు.
దీంతో గత వారం రోజులుగా మాధురి ఆట తీరులో చాలా మార్పు వచ్చింది. హౌస్ లోకి ఎంటర్ అవుతూ విమర్శలు చేసినా.. ఇప్పుడు తనూజతో క్లోజ్ గా ఉంటుంది. అలాగే టాస్కులలోనూ అందరితో కలిసి గట్టిగానే ఫైట్ చేసింది. ఇప్పుడిప్పుడే పాజిటివిటీ సొంతం చేసుకుంటున్న సమయంలో.. మాధురి హౌస్ నుంచి బయటకు వెళ్లడం అందరినీ షాకింగ్ కి గురిచేస్తోంది. అయితే దీనిపై కొద్దిసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.






