- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా అమ్మ పాడే బతుకమ్మ పాటలు విని నేర్చుకున్నా: చంద్రబోస్
by Gantepaka Srikanth |
తెలుగు చిత్ర పరిశ్రమను ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ప్రపంచ వేదికపై నిలబెట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచ వేదికపై నిలబెట్టారు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్(Lyricist Chandrabose). ఆయన రాసిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నాది వరంగల్ జిల్లా.. బతుకమ్మ పండుగ సమయంలో మా అమ్మ అనే పాటలు పాడుతుండేది. ఆ బతుకమ్మ పాటల నుండి నేను పాటలు రాయడం నేర్చుకున్నాను.. మా అమ్మకు చదువు రాదు. అందుకే నేను రాసే ప్రతి పాట మా అమ్మకు కూడా అర్థం కావాలి అని సులభంగా రాస్తాను. మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం సక్రమంగా వినియోగించుకుంటే, ప్రతి అవకాశం ఒక మెట్టు అవుతుంది. సాధారణంగా తాము సినిమా కోసం పాటలు రాస్తాం. కానీ సినిమా కోసం పుట్టిన ఆ పాట బయటకు వచ్చిన తర్వాత, సినిమాని మించి ఎదుగుతోంది’ అని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.
Next Story






