Love OTP: లవ్ ఓటీపీ 14 ఏళ్ల డ్రీమ్‌

by velandi.Saikiran |   (  Updated:2025-11-13 17:43:59  IST  )

హీరో, దర్శకుడు అనిష్ తేజేశ్వర్ మాట్లాడుతూ ఈరోజు కోసం తాను 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని

Love OTP: లవ్ ఓటీపీ 14 ఏళ్ల డ్రీమ్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని సినిమాలు హిట్ అవుతుంటే మరికొన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఇక మరికొన్ని సినిమాలు జనాలను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిలో లవ్ ఓటీపీ ఒకటి. ఈ సినిమా నవంబర్ 14వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రీమియర్ షోను రాజీవ్ కనకాల పుట్టిన రోజు సందర్భంగా ప్రదర్శించారు. ఈ సినిమాలో హీరోగా అనీష్ చేయగా, జాన్వికా కలకేరి, స్వరూపిణి ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఆనంద్ రాజ విక్రమ్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగారు. రాజీవ్ కనకాల తండ్రి పాత్ర పోషించారు. భవప్రిత ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విజయ్ ఎం రెడ్డి ఈ సినిమా తీశారు.

అయితే ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన అనంతరం హీరో, దర్శకుడు అనిష్ తేజేశ్వర్ మాట్లాడుతూ ఈరోజు కోసం తాను 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. తన సినిమాలు చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని వెల్లడించారు. తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ, తమ సినిమా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. నాకు అని పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాడని తెలిపారు. ఈ సినిమా కోసం అనీష్ పడిన కష్టం అంతా ఇంతా కాదని వెల్లడించారు. సినిమా ఔట్ ఫుట్ అద్భుతంగా ఉందని తెలిపారు. ఇద్దరు హీరోయిన్లు దుమ్ము లేపారన్నారు.

Next Story