‘గీతాంజలి’ లాంటి అద్భుతమైన ప్రేమ కథ ‘లవ్ డేస్’

by Sujitha Rachapalli |

నవీన్, కుసుమ చందక జంటగా ఆన్ క్యాన్ ఎంటర్టైన్మెంట్స్, క్రిసెంట్ సినిమాస్ బ్యానర్ల మీద మాదల వెంకటకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ డేస్’. ఏ టాక్సిక్ లవ్ స్టోరీ అనేది ఉప శీర్షిక. ఈ మూవీని సురేష్ లంకలపల్లి తెరకెక్కిస్తుండగా.. తాజాగా టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు

‘గీతాంజలి’ లాంటి అద్భుతమైన ప్రేమ కథ ‘లవ్ డేస్’
X

దిశ, సినిమా : నవీన్, కుసుమ చందక జంటగా ఆన్ క్యాన్ ఎంటర్టైన్మెంట్స్, క్రిసెంట్ సినిమాస్ బ్యానర్ల మీద మాదల వెంకటకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ డేస్’. ఏ టాక్సిక్ లవ్ స్టోరీ అనేది ఉప శీర్షిక. ఈ మూవీని సురేష్ లంకలపల్లి తెరకెక్కిస్తుండగా.. తాజాగా టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘గీతాంజలి’, ‘తొలి ప్రేమ’, ‘అందాల రాక్షసి’ లాంటి అద్భుతమైన ప్రేమ కథల్లా ఈ ‘లవ్ డేస్’ నిలిచిపోతుంది. ‘లవ్ డేస్’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఈ మూవీ జీవితంలో ఎన్నో మెమోరీస్‌ను అందించాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ .. ‘నిర్మాత వెంకట్ గారి వల్లే ఈ కథ, ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. సర్ నన్ను హీరోగా ఎందుకు చేయాలని అనుకున్నారో నాకైతే తెలియడం లేదు (నవ్వుతూ). డిసెంబర్ నుంచి మా నిర్మాత కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నారు. ఆర్య సాయి కృష్ణ ‘రాచరికం’ నుంచి నాతో జర్నీ చేస్తున్నారు. ఎడిటర్ ప్రదీప్ ఎప్పుడూ కష్టపడుతూనే పని చేశాడు. వెంగి సార్ మ్యూజిక్ ఎప్పుడూ అద్బుతంగానే ఉంటుంది. రాం ప్రసాద్ గారి డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. నవీన్ కటౌట్ బాగుంటుంది. కుసుమకి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఆదిత్యకి తెలుగు అంతగా రాకపోయినా కష్టపడి డైలాగ్స్ చెప్పాడు. ఈ మూవీలో ప్రతీ ఒక్కరి పాత్ర బాగుంటుంది’ అని తెలిపాడు.

నిర్మాత మాదల వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘సురేష్ లంకలపల్లి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ ప్రయాణంలో అతని డెడికేషన్ నాకు చాలా నచ్చింది. ఆయనతోనే మళ్లీ నెక్ట్స్ సినిమా కూడా చేయబోతున్నాం. భవిష్యత్తులో కూడా ఆయనతో సినిమాలు చేస్తాను. నేను చేయనున్న నాలుగో సినిమాలో ఆయనే హీరోగా నటిస్తారు. నవీన్, కుసుమ, ఆదిత్య ఇలా అందరూ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. మా మూవీ టైటిల్, గ్లింప్స్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. త్వరలోనే మేం ఆడియన్స్ ముందుకు రాబోతున్నాం’ అని అన్నారు.

Next Story