- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్న లవ్ అండ్ ఎమోషనల్ మూవీ.. పోస్ట్ వైరల్
మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) కథానాయికగా ‘అందాల రాక్షసి’(andala Rakshasi) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) కథానాయికగా ‘అందాల రాక్షసి’(andala Rakshasi) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నవీన్‌చంద్ర(Naveen Chandra), రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) హీరోలుగా నటించగా.. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వం వహించారు. అలాగే వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి(Sai Korrapati), ఎస్.ఎస్.రాజమౌళి(SS Rajamouli) నిర్మించారు. ఇక 13 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ విభిన్నమైన ప్రేమకథగా, మనసును కట్టిపడేసే భావోద్వేగాలతో మెప్పించింది. ఈ క్రమంలో ఈ మూవీకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..
ప్రజెంట్ టాలీవుడ్(Tollywood)లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా చిత్రాలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అందాల రాక్షసి మూవీని కూడా ఈ నెల 13న రీరిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మ్యూజికల్ లవ్‌స్టోరీని మరలా బిగ్‌స్క్రీన్‌పై ఆస్వాదించే అవకాశమిదని నిర్మాతలు పేర్కొన్నారు. అలా పదమూడేళ్ల క్రితం విడుదలైన ‘అందాల రాక్షసి’ చిత్రం హృద్యమైన ప్రేమకథగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈ మూవీ మళ్లీ థియేటర్లలో రాబోతుండటంతో యూత్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






