ప్రసాద్ ల్యాబ్స్‌లో లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా బ్యూటీ పేజంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమం

by Sujitha Rachapalli |

దక్షిణ భారతదేశంలో బాల, బాలికల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఉన్న లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా బ్యూటీ పేజంట్‌కు సంబంధించిన కర్టెన్ రైజర్, హైదరాబాద్‌

ప్రసాద్ ల్యాబ్స్‌లో లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా బ్యూటీ పేజంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమం
X

దిశ, సినిమా : దక్షిణ భారతదేశంలో బాల, బాలికల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఉన్న లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా బ్యూటీ పేజంట్‌కు సంబంధించిన కర్టెన్ రైజర్, హైదరాబాద్‌ ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాండ్ ఫినాలే తేదీ మరియు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ది లుక్స్ – మోడలింగ్ & యాక్టింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పేజంట్, పిల్లల్లో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, స్టేజ్ ప్రెజెన్స్‌ను పెంపొందించడం ప్రధాన ఉద్దేశ్యం. ఈ పోటీల్లో హైదరాబాద్‌తో పాటు విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి నగరాల నుంచి పాల్గొననున్నారు. ఫైనల్ డిసెంబర్ 27న యూసుఫ్‌గూడ పోలిస్ లైన్స్‌లోని శౌర్య కన్వెన్షన్ హాల్‌లో జరగనుంది.కార్యక్రమానికి బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మాండ ప్రధాన అతిథిగా, ప్రముఖ యాంకర్ రవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి ఈవెంట్‌ ప్రమోషనల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

మీడియాతో మాట్లాడిన కౌశల్ మాండ.. “ఇది కేవలం అందాల పోటీ కాదు; బాలల వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు, క్రియేటివిటీకి వేదిక. ఎటువంటి ఒత్తిడి లేకుండా, పిల్లలకు అనుకూలమైన నైతిక నియమాలతో కార్యక్రమం సాగుతుంది” అని తెలిపారు. పేజంట్‌లోని వయస్సు విభాగాలు 3–6, 7–10, 11–14, 15–19 ఏళ్లు. ఇందులో పాల్గొనే వారికి సర్టిఫైడ్ గ్రూమింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కన్ఫిడెన్స్ బిల్డింగ్ వర్క్‌షాప్స్, టాలెంట్ రౌండ్స్, ర్యాంప్ వాక్ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

యాంకర్ రవి మాట్లాడుతూ.. “ఇలాంటి వేదికలు పిల్లలు చిన్న వయస్సులోనే తమ ప్రతిభ, శక్తి ఏమిటో తెలుసుకునేలా చేస్తాయి. కమ్యూనికేషన్, సామాజిక నైపుణ్యాలు, ఆత్మగౌరవం పెరగడానికి ఇవి ఉపకరిస్తాయి” అని అభినందించారు. సౌత్శ్ ఇండియాలో అభిరుచితో పనిచేస్తున్న మహిళా డిజైనర్లను ప్రోత్సహించే లిటిల్ ఇండియా ఫ్యాషన్ టైమ్స్ (LIFT) కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన స్పాన్సర్లు, భాగస్వాములకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story