- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పులు చేస్తేసే లైఫ్ ఎక్కువగా నేర్పిస్తుంది.. సోనాక్షి సిన్హా కామెంట్స్
గ్లామర్ పాత్రలతో పాటు కథాబలం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది సోనాక్షి సిన్హా

దిశ, సినిమా: గ్లామర్ పాత్రలతో పాటు కథాబలం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha). గతేడాది ‘హీరామండీ’(Hira Mandi)తో తనలోని మరో యాంగిల్ బయట పెట్టిన ఈమె.. ఇటీవల ‘జటాధర’ (Jatadhara) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొని తన పర్సనల్ లైఫ్ అండ్ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
‘తప్పులు చేయడం అంటే నాకు భయం లేదు. ఎందుకంటే.. మనం తప్పులు చేస్తేనే లైఫ్ ఎక్కువ నేర్పిస్తుంది. చిన్న పిల్లలు పడుతూ లేస్తూ నడక నేర్చుకుంటారు. అలాగే పెద్దవాళ్లమైనా అంతే. చదువు, కెరీర్, రిలేషన్స్ ఏదైనా ఫెయిల్యూర్స్, మిస్టేక్స్ మనల్ని స్ట్రాంగ్‌గా చేస్తాయి. కొన్ని సార్లు అవే బెస్ట్ టీచర్లు అవుతాయి. అందుకే ప్రతీ తప్పును నేను ఒక లెర్నింగ్ స్టెప్‌గా చూస్తాను’ అంది. ఇక యాక్టింగ్ గురించి మాట్లాడుతూ.. ‘భాష ఏదైనా పర్వాలేదు. టాలెంట్ ఉన్న వారితో పని చేయడం నాకు ఇష్టం. కొత్త టీమ్‌ల నుంచి ఏదో ఒక కొత్త అనుభవం వస్తుంది. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు మారే ట్రెండ్స్‌కి అడ్జస్ట్ అవుతూ కొత్త కథలు, కొత్త పాత్రలను ప్రయత్నించడం నా జర్నీని స్పెషల్‌గా మార్చింది’ అంటూ చెప్పుకొచ్చింది.






