Rashmika Mandanna: జీవితం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అంటూ ఫొటోలు షేర్ చేసిన రష్మిక..

by Chukka Sudharani |   (  Updated:2025-02-26 15:24:38  IST  )

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.

Rashmika Mandanna: జీవితం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అంటూ ఫొటోలు షేర్ చేసిన రష్మిక..
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా గతేడాది వచ్చిన ‘పుష్ప-2’తో ఆ క్రేజ్ మరింత పెంచుకున్న ఈ బ్యూటీ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. దీంతో పాటు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ‘యానిమల్’ చిత్రంతో బాలీవుడ్‌లో కూడా ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. రీసెంట్‌గా ‘ఛావా’ (Chava) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా నటించిన ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 14 న గ్రాంగ్‌గా థియేటర్‌లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో ప్రజెంట్ మూవీ టీమ్ ప్రజెంట్ ‘ఛావా’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస పోస్టులతో సందడి చేస్తుంది రష్మిక. ఇందులో భాగంగా తాజాగా ట్రెడీషనల్ లుక్‌ (Traditional look)లో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘జీవితం ఎల్లప్పుడూ ఈ చిత్రాల వలెనే ఉండాలని నేను కోరుకుంటున్నాను.. కేవలం సంతోషంగా, ప్రకాశవంతంగా, ఉల్లాసభరితంగా అండ్ సరదాగా... మీరు అంగీకరిస్తున్నారా?’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

click for tweet ..

Next Story