మా ‘ఎమ్మెల్సీ మామయ్య’కు శుభాకాంక్షలు.. నాగబాబుకు హీరోయిన్ విషెస్

by Gantepaka Srikanth |

జనసేన పార్టీ(Jana Sena Party) ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు(Nagababu) ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

మా ‘ఎమ్మెల్సీ మామయ్య’కు శుభాకాంక్షలు.. నాగబాబుకు హీరోయిన్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ(Jana Sena Party) ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు(Nagababu) ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో పాటు చాలామంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా.. నాగబాబుకు ప్రముఖ హీరోయిన్, స్వయానా ఆయన కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) శుభాకాంక్షలు చెప్పింది. ‘ప్రజలకు సేవ చేసే క్రమంలో మీరు మరో మైలు రాయికి చేరుకున్నారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మావయ్యా. హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్‌లో లావణ్య త్రిపాఠి పేర్కొంది. అందాల రాక్షసి సినిమాతో లావణ్య ఇండస్ట్రీకి పరిచయమైంది. వరుణ్ తేజ్, సాయితేజ్, అల్లు శిరీశ్ వంటి మెగా హీరోలందరితోనూ వర్క్ చేసింది. ఫైనల్‌గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌(Varun Tej)ను లవ్ చేసి వెళ్లి చేసుకున్నది. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నాగబాబుతో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా బీజేపీ నేత సోము వీర్రాజు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరు నేతలతో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. గత మార్చి నెలలో జరిగిన శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన నాగబాబు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలకు అనుగుణంగా నాగబాబు శాసనమండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.



Next Story