ప్లాన్ ప్రకారం వస్తే విజయమే!.. నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్

by Chukka Sudharani |

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ప్లాన్ ప్రకారం వస్తే విజయమే!.. నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు డే బై డే పెరిగిపోతున్నాయి. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ కాగా.. ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఎక్కువ భాగం చిత్రీకరణ పూర్తవగా, ఇంకొద్ది రోజుల పనితో షూట్ ముగియనుంది. ఆగస్టు 2026 రిలీజ్ లక్ష్యంగా టీమ్ ముందుకెళ్తుండగా, పోస్ట్ ప్రొడక్షన్‌కు సరిపడ సమయం కూడా ఉంది. ప్లాన్ ప్రకారం విడుదలైతే నానికి మరో విజయావకాశం కనిపిస్తోంది అంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా.. ఈ భారీ యాక్షన్ డ్రామాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. కయ్యదు లోహర హీరోయిన్‌గా నటిస్తుంది. ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో విడుదల కానుంది.


Next Story