- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధ్రువ నక్షత్రం’ విడుదలపై తాజా సమాచారం.. ఆ హీరోకి గుబులు
'ధ్రువ నక్షత్రం' చిత్రాన్ని మే 22న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని సంవత్సరాలుగా స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు అనేకం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ జానర్ సినిమాలు పెద్దగా ఆదరణ పొందని సమయంలోనే చియాన్ విక్రమ్ హీరోగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం అనే స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అనేక అంతరాయాలు ఎదురయ్యాయి. కష్టపడి గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని పూర్తి చేసినప్పటికీ, పలుమార్లు విడుదల తేదీలు ప్రకటించినా సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. ఈ మూవీ కోసం విక్రమ్ అభిమానులతో పాటు తమిళ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి కోలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని మే 22న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని, దీనిపై అధికారిక ప్రకటనను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన కరుప్పు మే 14న విడుదల కానుంది. దాంతో ధ్రువ నక్షత్రం మంచి టాక్ తెచ్చుకుంటే, కరుప్పు చిత్రానికి రెండో వారంలో బాక్సాఫీస్ వద్ద కొంత ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక నిజంగా ఈ సినిమా మే 22న విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.






