- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ ఆంటోని నెక్ట్స్ ప్రాజెక్టుపై లేటెస్ట్ బజ్.. హీరోయిన్‌గా ఆ యంగ్ బ్యూటీ!
డిఫరెంట్ కంటెంట్ చిత్రాలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోని.

దిశ, సినిమా: డిఫరెంట్ కంటెంట్ చిత్రాలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని.. గతేడాది ‘మార్గన్’ చిత్రంతో పలకరించాడు. లియో జాన్ పాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27, 2025 థియేటర్స్‌లోకి వచ్చింది. తన కూతురి హత్యకు ప్రతీకారం తీర్చుకునే ఓ కథగా రూపొంది ఈ తమిళ ఫాంటసీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత విజయ్ ఆంటోని మరో ప్రాజెక్టు అనౌన్స్ చేయలేదు. ఈ క్రమంలోనే ఆయన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతున్నది.
ఈ మేరకు తమిళంలో ‘ఇరవుక్కు ఆయిరం కంగళ్’ చిత్రంతో పేరు తెచ్చుకున్న ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడట. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘అప్పా కుట్టి’ అనే టైటిల్ పెట్టారని తెలుస్తుండగా.. ఇది కూడా తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న బలమైన భావోద్వేగ బంధం చుట్టూ తిరుగుతుందని తమిళ ఇండస్ట్రీ నుంచి సమాచారం. అలాగే.. ఇందులో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ ప్రీతిఅస్రానిని ఎంపిక చేసినట్లు తెలుస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.






