అక్కడ పవన్‌కళ్యాణ్‌తో ‘ఓజీ’ లాస్ట్ డే షూటింగ్.. నెక్స్ట్ ఎక్కడంటే.. హైప్ పెంచుతున్న పోస్ట్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-19 08:24:22  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న చిత్రాల్లో ‘ఓజీ’(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి.

అక్కడ పవన్‌కళ్యాణ్‌తో ‘ఓజీ’ లాస్ట్ డే షూటింగ్.. నెక్స్ట్ ఎక్కడంటే.. హైప్ పెంచుతున్న పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న చిత్రాల్లో ‘ఓజీ’(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రీసెంట్‌గా పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారని చిత్ర నిర్మాణ సంస్థ పీఆర్ టీమ్ అధికారికంగా తెలియజేసింది. "అసలైన 'ఓజీ' సెట్‌లోకి అడుగుపెట్టారు" అంటూ వారు చేసిన ప్రకటనతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అయితే పవన్ 'ఓజీ' సినిమాను శరవేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. పవన్‌తో అన్నపూర్ణ 7 ఎకరాల స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ చివరి రోజుకు చేరుకుందట. ఈ ప్రదేశంలో ఇది చివరి రోజు షూటింగ్ & దీని తర్వాత, రాబోయే షెడ్యూల్ కోసం బృందం ముంబైకి తరలి వెళుతోందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా డైరెక్టర్ సుజిత్(Sujith) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి(Imran Hashmi) ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అర్జున్ దాస్(Arjun Das), శ్రియా రెడ్డి(Sriya Reddy) తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కల్యాణ్ అత్యంత పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారని, అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Next Story