కార్మికుల ఫెడరేషన్ కు లేబర్ కమిషన్ జలక్

by Muthe.Rajitha |

సినీ కార్మికుల ఫెడరేషన్ కు లేబర్ కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఫెడరేషన్ కు సంబంధించిన కీలక వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

కార్మికుల ఫెడరేషన్ కు లేబర్ కమిషన్ జలక్
X

దిశ, వెబ్ డెస్క్ : సినీ కార్మికుల ఫెడరేషన్ కు లేబర్ కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఫెడరేషన్ కు సంబంధించిన కీలక వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కాగా గత కొద్దిరోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మెకు నేడు తెరపడుతుందని అందరూ అనుకుంటుండగా.. ఊహించని విధంగా ఫెడరేషన్ కు భారీ షాక్ ఇచ్చింది లేబర్ కమిషన్. కార్మికుల ఫెడరేషన్ సభ్యత్వ నమోదు ఫీజులు, ఇప్పటి వరకు అందుకున్న చందాల వివరాలు పూర్తిగా సమర్పించాలని నేడు నోటీసులు పంపింది. సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని ఆగస్టు 4 నుంచి కార్మికుల ఫెడరేషన్ సమ్మెలో పాల్గొంటుండగా.. టాలీవుడ్ లో అన్ని సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్ ల షూటింగ్ నిలిచిపోయాయి.

పలుమార్లు నిర్మాతల మండలి, ఫెడరేషన్ మధ్య చర్చలు జరిగినప్పటికీ అవేవి కూడా ఓ కొలిక్కి రాలేకపోయాయి. అయితే ఈరోజు మరోసారి నిర్మాతల మండలి, ఫెడరేషన్ మధ్య చర్చలు జరుగుతుండగా.. ఫెడరేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు కోరుతూ లేబర్ కమిషన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మరి ఫెడరేషన్ ఈ వివరాలు బయట పెడుతుందా? అసలు ఫెడరేషన్ లో నిజంగా ఏం జరుగుతోంది అనేవిప్రపంచానికి తెలిసే అవకాశాలున్నాయి.

Next Story