- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన రివ్యూయర్.. కాల్పుల కేసులో అరెస్ట్
by Sujitha Rachapalli |
ప్రముఖ రివ్యూయర్, నటుడు కమల్ ఆర్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. జనవరి 18 న ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ఒక నివాస భవనంపై కాల్పులు జరిగిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు

X
దిశ, సినిమా : ప్రముఖ రివ్యూయర్, నటుడు కమల్ ఆర్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. జనవరి 18 న ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ఒక నివాస భవనంపై కాల్పులు జరిగిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో KRK తన లైసెన్స్డ్ గన్‌తో 2 నుంచి 4 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆయన గన్‌ను శుభ్రం చేస్తుండగా లేదా పరీక్షిస్తుండగా అనుకోకుండా కాల్పులు జరిగాయని KRK వాదించినా.. పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి విచారణకు పిలిచి.. తర్వాత అధికారికంగా అరెస్ట్ చేశారు. గన్ స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్థానంలో హాజరు పరిచిన పోలీసులు.. జనవరి 27 వరకు కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. గతంలో కేఆర్కే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ను టార్గెట్ చేయగా.. ‘వార్ 2’ టైంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై వివాదాస్పద ట్వీట్లు వేశాడు. దారుణంగా విమర్శించాడు.
Next Story






