- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తనకు అక్కడ ముద్దు పెడుతూ కుర్ర హీరోయిన్ పోస్ట్.. నెట్టింట వైరలవుతోన్న ఫొటో
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty) తల్లి నేతి శెట్టి (Nethi Shetty)పుట్టిన రోజును నేడు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ కుర్ర హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty) తల్లి నేతి శెట్టి (Nethi Shetty)పుట్టిన రోజును నేడు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తనకు సన్నిహితులు, కుమార్తె అభిమానులు సోషల్ మీడియా వేదికన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కూతురు కృతి శెట్టి కూడా నెట్టింట తల్లి కోసం ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు మమ్మీ. నువ్వు నా దేవతవి. ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని సోషల్ మీడియా వేదికన రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ అందమైన ఫొటో కూడా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.
తల్లికి చెంపపై ముద్దు పెడుతోన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. పిక్ చూస్తుంటే పుట్టిన రోజు సందర్భంగా.. తల్లీకూతుళ్లిద్దరూ దేవాలయాన్ని సందర్శించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కుర్ర హీరోయిన్ తల్లిపై కురిపిస్తోన్న ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. ఇకపోతే కృతి శెట్టి అప్పుడప్పుడు తల్లితో కలిసి వెకేషన్స్‌కు వెళ్లిన పిక్స్, సరదాగా ఫొటో షూట్లు చేసినవి సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటం చూస్తూనే ఉంటాం.
ఇక కృతి శెట్టి ఉప్పెన మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా మెగా హీరోతో అవకాశం కొట్టేసింది. తర్వాత ఈ హీరోయిన్ శ్యామ్ సింగరాయ్ (Shyam Singaray), బంగార్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, మనమే, ఎఆర్‌ఎం వంటి సినిమాల్లో అవకాశం దక్కించుకుని మంచి పేరు సొంతం చేసుకుంది.






