- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kriti Shetty: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన బేబమ్మ
కృతి శెట్టి మాట్లాడుతూ... నాకు చాలా సంవత్సరాల క్రితం బ్రేకప్ అయ్యింది. ఆ విషయం మా అమ్మకి కూడా తెలుసు. ప్రస్తుతం మాత్రం నేను సింగిల్‌గానే ఉంటున్నానని తన లవ్ స్టేటస్ గురించి చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి కృతి శెట్టి తాజాగా నటుడు, దర్శకుడు అయిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందిన 'LIK' (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో కృతి శెట్టి వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్ అయింది. కృతి శెట్టి మాట్లాడుతూ... "నాకు చాలా సంవత్సరాల క్రితం బ్రేకప్ అయ్యింది. ఆ విషయం మా అమ్మకి కూడా తెలుసు. ఇక ప్రస్తుతం మాత్రం నేను సింగిల్‌గానే ఉంటున్నాను" అని తన లవ్ స్టేటస్ గురించి చెప్పింది.
అలాగే నెగెటివిటీని అస్సలు తట్టుకోలేనని, ఎవరైనా సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా ప్రవర్తిస్తే కచ్చితంగా వారిని బ్లాక్ చేస్తానని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేసింది. ఇలా ఈ యంగ్ హీరోయిన్ తాజాగా తన పర్సనల్ విషయాలను ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పడంపై పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విడుదలకు రెడీగా ఉన్న 'LIK' చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఎస్.జె. సూర్య కీలక పాత్రలో నటించగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్లపై నయనతార, లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు.






