- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kiran Abbavaram: రిలీజ్ రోజే ఐదారు ఆఫర్లు వచ్చాయి
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ… తాను నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంలో భాగమైన ఐదారు మందికి సినిమా విడుదలైన రోజే ఇతర చిత్రాల్లో అవకాశాలు వచ్చాయని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తాజాగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 17వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేశారు. మొదటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో, ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీకి మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. తాజాగా ఈ మూవీ యూనిట్ ఓ ఈవెంట్‌ను నిర్వహించగా, అందులో కిరణ్ అబ్బవరం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రాన్ని పూర్తిగా కొత్త వాళ్లతో, చాలా తక్కువ బడ్జెట్‌లో రూపొందించామని తెలిపారు.
సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని చెప్పారు. చిన్న సినిమా అయినప్పటికీ ప్రేక్షకులు ఎంతో గొప్పగా సపోర్ట్ చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా విజయంతో పాటు తనకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించిన మరో విషయం కూడా ఉందని కిరణ్ అబ్బవరం వెల్లడించారు. తమ సినిమాలో నటించిన ఐదారు మందికి సినిమా విడుదలైన మొదటి రోజే పెద్ద చిత్రాల్లో అవకాశాలు వచ్చినట్లు తెలిపారు. తన చిత్రం ద్వారా వారికి అవకాశాలు రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఈ యువ నటుడు పేర్కొన్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






