'కింగ్డమ్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచుతున్న హీరో

by I. Sairam |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న తాజా సినిమా ‘కింగ్డమ్’(Kingdom).

కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచుతున్న హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న తాజా సినిమా ‘కింగ్డమ్’(Kingdom). గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఇకఇందులోయంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sre Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీ భారీ అంచనాల నడుమ జూలై 31న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్లలో జోరు పెంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్రైలర్(Trailer) అప్‌డేట్ ఇస్తూ సోషల్ మీడియా(Social Media) వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా ఓ స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేశాడు. ‘7 రోజుల్లో కింగ్‌డమ్ ప్రపంచం అంతా మీదే అవుతుంది.. 2 రోజుల్లో కింగ్‌డమ్ ట్రైలర్ రాబోతుంది’ అని రాసుకొచ్చాడు. ఇక పోస్టర్‌లో విజయ్ వర్షంలో తడుస్తూ ఎవరినో చూస్తున్నాడు. ఊరమాస్ లుక్‌లో ఫైనల్‌గా సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. Link

Next Story