భయం కిరీటం ధరిస్తే.. ఇంట్రెస్టింటింగ్‌గా కింగ్ సినిమా గ్లింప్స్

by Sujitha Rachapalli |

‘జవాన్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ‘కింగ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లోనే తీవ్రగాయాల పాల్గొన్నాడు.సి

భయం కిరీటం ధరిస్తే.. ఇంట్రెస్టింటింగ్‌గా కింగ్ సినిమా గ్లింప్స్
X

దిశ, సినిమా : ‘జవాన్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ‘కింగ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లోనే తీవ్రగాయాల పాలైన ఆయన.. కొన్నాళ్లు బ్రేక్ తీసుకోగా మూవీ షూటింగ్, రిలీజ్ లేట్ అయిపోయింది. కాగా తాజాగా ఇట్స్ కింగ్ టైమ్ అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ చేశాడు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా.. డిశెంబర్ 24న మూవీ విడుదల ఉంటుందని పోస్ట్ పెట్టాడు. మోస్ట్ ఇంటెన్స్, యాక్షన్‌తో కూడిన టీజర్‌లో.. ఫియర్‌తో ఇయర్ ఎండ్ చేయండి.. భయం కిరీటం ధరిస్తే.. అనే క్యాప్షన్స్‌తో మూవీపై హైప్ క్రియేట్ చేయగలిగారు మేకర్స్. కాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఆ మాస్ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. ఇక ఈ టీజర్ చూసిన ఎస్ఆర్‌కే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story