మెగాస్టార్‌తో చిన్నారి అసభ్యకర ప్రవర్తన(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-13 13:29:54  IST  )

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతుంది. ప్రస్తుతం పదిహేడో సీజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆరో తరగతి చదివే పిల్లాడు హాట్ సీట్‌కు చేరుకోగలిగాడు. ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. కానీ

మెగాస్టార్‌తో చిన్నారి అసభ్యకర ప్రవర్తన(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతుంది. ప్రస్తుతం పదిహేడో సీజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆరో తరగతి చదివే పిల్లాడు హాట్ సీట్‌కు చేరుకోగలిగాడు. ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. కానీ పెద్దలతో మాట్లాడే మాటలు.. ముఖ్యంగా బిగ్ బీతో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం.. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బిహేవ్ చేయడం చూసే ఆడియన్స్‌కు చిరాకు తెప్పింది.

క్వశ్చన్స్ అడుగుతుంటే ఇది కూడా ప్రశ్నేనా అనడం.. ఆప్షన్స్ ఇవ్వక ముందే ఆన్సర్ లాక్ చేయమనడం.. ఆప్షన్ లేకుండా మాట్లాడుతున్నా అంటూ డైలాగ్స్ వేయడం తిట్టేలా చేసింది. తల్లిదండ్రుల పెంపకంపై కామెంట్స్ చేసే వరకు వెళ్లింది. అయితే ముందు అడిగిన నాలుగు ప్రశ్నలకు అతిచేస్తూ సమాధానమిచ్చిన పిల్లాడు.. ఐదోసారి కూడా అలాగే చేశాడు. కానీ తొందరపాటు కారణంగా అది కాస్త రాంగ్ అయింది. దీంతో సదరు అబ్బాయి ఏమీ పొందకుండానే గేమ్ నుంచి ఎగ్జిట్ కావాల్సి వచ్చింది.

Next Story