- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LoveUnderConstruction:‘ఇలాంటి ఫీల్ గుడ్ సిరీస్‌ని సృష్టించినందుకు మొత్తం టీమ్‌కి వందనాలు’: కీర్తి సురేష్
విష్ణు జి. రాఘవ దర్శకత్వం వహించిన మలయాళ రొమాంటిక్-కామెడీ వెబ్ సిరీస్ ‘లవ్ అండర్ కన్స్ట్రక్షన్’.

దిశ, వెబ్‌డెస్క్: విష్ణు జి. రాఘవ దర్శకత్వం వహించిన మలయాళ రొమాంటిక్-కామెడీ వెబ్ సిరీస్ ‘లవ్ అండర్ కన్స్ట్రక్షన్’. ఈ మూవీ ఫిబ్రవరి 28 నుంచి జియో హాట్‌స్టార్‌లో విడుదల అయ్యింది. మృంజిత్ నిర్మించిన ఈ మూవీలో నీరజ్ మాధవ్, అజు వర్గీస్, విష్ణురాఘవ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగు, ఈ సిరీస్ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మలయాళం, మరాఠీ భాషల్లో డబ్ చేశారు.
ఈ సిరీస్ వినోద్ అనే వ్యక్తి తన కలల గృహాన్ని నిర్మించడానికి ఎదుర్కొనే కష్టాల చుట్టూ తిరుగుతుంది. కొత్త ఇల్లు, లవర్ మధ్య చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతాడు ఓ యువకుడు. గల్ఫ్ వెళ్లి మనీ పొదుపు చేసి.. స్వంత గ్రామంలో ఇల్లు కట్టుకోవాలనుకునే ఓ సాధారణ మధ్యతరగతి మలయాళీ యువకుడి జీవితం ప్రేమలో పడిన తర్వాత ఎలా ఛేంజ్ అయిందో ఈ వెబ్ సిరీస్‌లో చూడవచ్చు.
ఇల్లు కట్టుకోవాలన్న ఆ యువకుడి డ్రీమ్ ఎలా దారి తప్పిందని ఈ సిరీస్‌లో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రిచ్ గా ఇల్లు కట్టుకోవాలనే కళ, ఇటు ప్రేమ మొత్తానికి రెండింటి మధ్యన ఇరుక్కునే యువకుడి జీవితం కాస్త నవ్విస్తూ తీశాడు. మొత్తంగా ఏడు బాషల్లో విడులైన ఈ వెబ్ సిరీస్‌ను కొన్నాళ్ల కిందటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రకటించారు. తర్వాత వాలెంటైన్స్ డే కు వస్తుందని అనుకున్నారు.
కానీ చివరగా ఫిబ్రవరి 28 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ వీక్షించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికన రివ్యూ ఇచ్చింది. ‘‘నీరజ్ మాధవ్, అజు వర్గీస్, విష్ణురాఘవ్, గౌరి, రీజపుత్ర అని పేర్లు మెన్షన్ చేసి.. #LoveUnder Constructionని చూశాను. కొన్ని అందమైన భావోద్వేగాలతో నిండిన అలాంటి తేలికపాటి, కామెడీ డ్రామాను చూడటం చాలా ఆనందంగా ఉందని నేను చెప్పాలి.
విష్ణురాఘవ్ ఈ స్టోరీని చాలా బాగా రాశారు. ఎంత అందమైన స్క్రీన్ ప్లే.. @neeraj_madhav మీరు పునాదిపై బాగా నిర్మించారు. మిమ్మల్ని వినోద్‌గా చూడటం చాలా ఫ్రెష్‌గా ఉంది. @ajuvarghese నిన్ను పప్పెట్టాగా చూస్తుంటే అల్లరి అయ్యింది. నేను మీ పాత్రను ఇష్టపడ్డాను! హాహా @gourigkofficial @saleem_bhaai ధారావాహిక అంతటా మీరు చాలా సూక్ష్మబుద్ధితో మిమ్మల్ని ఎలా నడిపించారో నచ్చింది. మీరు చాలా బాగున్నారు ఇందులో.. ఇలాంటి ఫీల్ గుడ్ సిరీస్‌ని సృష్టించినందుకు #LoveUnderConstruction మొత్తం టీమ్‌కి వందనాలు’’ అని కీర్తి సురేష్ రాసుకొచ్చింది.
READ MORE ...
Roshan Kanakala: ఈసారి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.. యంగ్ హీరో పోస్టర్‌పై నెటిజన్స్ రియాక్షన్!






