Kayadu Lohar: అర్ధరాత్రి ఆ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఫోన్… ఒక్కసారిగా షాక్ అయ్యాను

by Pulgam srinivas |

కాయాదు లోహర్ మాట్లాడుతూ… సాయి అభ్యంకర్ ఒకరోజు అర్ధరాత్రి ఫోన్ చేసి 'పళవ మల్లి' సాంగ్ వినిపించాడని, ఆ పాట తనకు ఎంతో నచ్చడంతో వెంటనే చేయడానికి ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది.

Kayadu Lohar: అర్ధరాత్రి ఆ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఫోన్… ఒక్కసారిగా షాక్ అయ్యాను
X

దిశ, వెబ్ డెస్క్: తన అందంతో, నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న కాయాదు లోహర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె వరుస సినిమాల్లో నటిస్తూనే తాజాగా ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో కూడా నటించింది. 'డ్యూడ్' చిత్రంతో సంగీత దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సాయి అభ్యంకర్ తాజాగా 'పళవ మల్లి' అనే సాంగ్‌ను కంపోజ్ చేశాడు. ఇందులో కాయాదు తన అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈ క్రేజీ సాంగ్‌లో తనకు అవకాశం ఎలా వచ్చింది? ఆ తర్వాత ఈ సాంగ్ కోసం ఏ స్థాయిలో కష్టపడ్డామనే విషయాలను క్లియర్‌గా వివరించింది.

కాయాదు లోహర్ మాట్లాడుతూ… "ఒకరోజు అర్ధరాత్రి సమయంలో సాయి అభ్యంకర్ నుండి నాకు ఫోన్ వచ్చింది. దాంతో నేను షాక్ అయ్యాను. ఆ తర్వాత ఆయన నాకు అసలు విషయం చెప్పి ఆ పాటను కూడా వినిపించాడు. అది నాకు బాగా నచ్చడంతో వెంటనే ఆయనతో చేస్తానని చెప్పాను. ఓకే అని ఈజీగా చెప్పాను కానీ ఆ పాట కోసం చాలా కష్టపడ్డాం. సాంగ్ కోసం ఒకవైపు రిహార్సల్స్ చేయడం, మరోవైపు నా సినిమా షూటింగులు చూసుకోవడం జరిగింది. అలాగే నా సినిమా షూటింగ్ల కారణంగా కొన్ని రోజులు రాత్రి 2 గంటల వరకు చిత్రీకరణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సాంగ్ అద్భుతంగా రావడం కోసం టీమ్ మొత్తం ఎంతగానో కష్టపడింది. ఆ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు మిలియన్ల కొద్ది వ్యూస్ రూపంలో వస్తోంది" అని ఆమె చెప్పుకొచ్చింది.

Next Story