Karuppu: పీక్ మాస్ టీజర్ లోడ్ అవుతోంది.. సూర్య సినిమాపై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |

తమిళ స్టార్ సూర్య, డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘కరుప్ప’.

Karuppu: పీక్ మాస్ టీజర్ లోడ్ అవుతోంది.. సూర్య సినిమాపై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: తమిళ స్టార్ సూర్య, డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘కరుప్ప’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై రూపొందుతోన్న ఈ మూవీ‌లో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్వాసిక, ఇంద్రన్స్, యోగిబాబు, శశివాడ, నట్టి సుబ్రమణ్యం, సుప్రీత్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రీసెంట్‌గా కరుప్ప టీజర్ సెన్సార్ పూర్తి కాగా.. విడుదలపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు బ్లాక్ షేడ్‌లో ఉన్న సూర్య ఫొటోను షేర్ చేస్తూ.. ‘పీక్ మాస్ టీజర్ లోడ్ అవుతోంది.. 1 నిమిషం 38 సెకన్లు టీజర్ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ తెలిపారు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌లో టీజర్ ఈనెల 23న రాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతూ నెట్టింట విశేష స్పందన సొంతం చేసుకుంటుంది. లింక్

Next Story