- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Karuppu: ఆ ప్రముఖ సంస్థ చేతికి కరుప్పు నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ హక్కులు
కరుప్పు యొక్క నార్త్ ఇండియా హక్కులను పెన్ స్టూడియోస్, పెన్ మారుధర్ సినీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలంగా సూర్య నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వస్తున్నాయి. దాంతో ఆయన నటించిన సినిమాలపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఏర్పడడం లేదు. కానీ ప్రస్తుతం సూర్య నటిస్తున్న 'కరుప్పు'పై మాత్రం పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ప్రధాన కారణం ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు బాగుండడం, అలాగే నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆర్.జె. బాలాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా ఈ మూవీ మేకర్స్ అమ్మేశారు.
అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క నార్త్ ఇండియా హక్కులను పెన్ స్టూడియోస్, పెన్ మారుధర్ సినీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. పెన్ స్టూడియోస్ సంస్థ ఇప్పటివరకు ఎన్నో సౌత్ సినిమాలను నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున విడుదల చేసింది. ఈ సంస్థ చేతికి ఈ మూవీ హక్కులు వెళ్లడంతో ఈ చిత్రానికి గనుక మంచి టాక్ వచ్చినట్లయితే నార్త్ ఇండియాలో భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశాలు ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. మే 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.






