Yuganiki Okkadu : రీ-రిలీజ్‌కు సిద్ధమైన ఎపిక్ ఫాంటసీ మాస్టర్ పీస్.. చోలాస్ తిరిగి వస్తున్నారు అంటూ పోస్ట్

by Chukka Sudharani |

కార్తీ (Karthi), రీమా సేన్ (Reema Sen), ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah), పార్తీబన్ (Partiban) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యుగానికి ఒక్కడు’

Yuganiki Okkadu : రీ-రిలీజ్‌కు సిద్ధమైన ఎపిక్ ఫాంటసీ మాస్టర్ పీస్.. చోలాస్ తిరిగి వస్తున్నారు అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: కార్తీ (Karthi), రీమా సేన్ (Reema Sen), ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah), పార్తీబన్ (Partiban) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యుగానికి ఒక్కడు’ (Yuganiki Okkadu). బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ (Selva Raghavan) తెరకెక్కించిన ఈ సినిమా.. 2010లో సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న రిలీజైంది. తమిళనాడులో చారిత్రక కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీ థియేటర్‌లలో ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. డైరెక్టర్ సెల్వ రాఘవన్ క్రియేట్ చేసిన విజువల్ వండర్, కథ అప్పట్లో ప్రేక్షకులకు అర్థం కాలేదు. దీంతో తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా హిట్ కాలేదు.

కానీ, తర్వాత ఈ మూవీలోని గ్రాఫిక్స్‌కు, డైరెక్టర్ రైటింగ్‌కు, కార్తీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో టీవీల్లో వచ్చాక ఈ మూవీ హిట్ అందుకుంది. దీంతో పార్ట్-2 కూడా కావాలని గత కొంత కాంలగా ఆడియన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే.. పార్ట్-2పై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు కానీ, ఇప్పుడు ఈ మూవీ రీ రిలీజ్‌ (Re-Release)కు మాత్రం సిద్ధం అయింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. ‘చోలాస్ తిరిగి వస్తున్నారు! ఎపిక్ ఫాంటసీ మాస్టర్ పీస్ ‘యుగానికి ఒక్కడు’ సినిమా 15 ఏళ్ల తర్వాత మరోసారి వెండితెరను అలరించడానికి సిద్ధంగా ఉంది. మార్చి 14న AP & TG, కర్ణాటక అండో USAలో థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు’ అంటూ పోస్ట్ పెట్టారు.

Next Story