అన్నగారి రాకకు సమయం ఆసన్నమైంది.. పోలీస్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న కార్తీ

by Chukka Sudharani |

స్టార్ హీరో కార్తి(Karthi) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వా వాతియార్’(Vaa Vaathiyaar).

అన్నగారి రాకకు సమయం ఆసన్నమైంది.. పోలీస్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న కార్తీ
X

దిశ, సినిమా: స్టార్ హీరో కార్తి(Karthi) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వా వాతియార్’(Vaa Vaathiyaar). ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అన్నగారు వస్తారు’(Anna Garu Vostaru) అనే టైటిల్‌తో రాబోతోంది. ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా(K.E. Gnanavel Raja) నిర్మిస్తున్న ఈ యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి (Director Nalan Kumaraswamy)రూపొందిస్తున్నారు. కృతి శెట్టి (Kriti Shetty)హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ తాజాగా ప్రకటించారు మేకర్స్. డిసెంబర్‌లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతండుగా.. కార్తీ పోలీస్ లుక్‌లో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు. ఇక ఈ ‘అన్నగారు వస్తారు’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story