- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahmedabad Plane Crash: ‘కన్నప్ప’ ట్రైలర్ వాయిదా
అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో కన్నప్ప సినిమా బృందం కీలక నిర్ణయం తీసుకుంది. కన్నప్ప ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తనను తీవ్రంగా కలిచి వేసిందని... హీరో మంచు విష్ణు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంలో గాయపడిన అలాగే మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇక సంఘటన నేపథ్యంలో సంతాపంగా....కన్నప్ప ట్రైలర్ విడుదలను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటన చేశారు.
అలాగే రేపు ఇండోర్ లో జరిగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు... పోస్ట్ పెట్టారు మంచి విష్ణు. కాగా ఈ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 110 మంది మరణించినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






