- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kannappa : కన్నప్ప మూవీ HD ప్రింట్ పైరసీ.. 24 గంటల క్రితమే ఆ యాప్‌లో ప్రత్యేక్షం.. మంచు విష్ణు రియాక్షన్ ఇదే
డైనమిక్ హీరో మంచు విష్ణు, డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’.

దిశ, సినిమా: డైనమిక్ హీరో మంచు విష్ణు, డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు నిర్మించారు. ఇందులో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలో నటించారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ కాగా.. జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైంది ‘కన్నప్ప’ చిత్రం రిలీజ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఇక మొత్తానికి కన్నప్ప బాక్సాఫీసు వద్ద మెప్పిస్తుందని చిత్ర బృందం రీసెంట్ సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఇందలోనే కన్నప్ప టీమ్‌కు బిగ్ షాక్ ఎదురైంది. సోషల్ మీడియాలో ఈ సినిమా HD ప్రింట్ దారుణంగా పైరసీ అవుతోంది. థర్డ్ పార్టీ యాప్ అయినా బొప్పమ్ టీవీలో ప్రత్యక్షమైంది. దీంతో కన్నప్ప టీమ్‌తో పాటు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులు కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ పైరసీపై తాజాగా మంచు విష్ణు కూడా స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చాడు. ‘ప్రస్తుతం కన్నప్ప సినిమా పైరసీ దాడిలో ఉంది. ఇప్పటికే 30,000 కి పైగా అక్రమ లింక్‌లను తొలగించారు. ఇది చాలా బాధాకరం. డైరెక్ట్‌గా ఇన్‌డైరెక్ట్‌గా కూడా పైరసీ అంటే దొంగతనం. మేము మా పిల్లలకు దొంగతనం నేర్పించము. దయచేసి మీరు కూడా దానిని ప్రోత్సహించవద్దు. సినిమాను సరైన మార్గంలో సపోర్ట్ చేయండి. హర్ హర్ మహాదేవ్’ అని తెలిపాడు. Link






