'కన్నప్ప' కు షాకింగ్ కలెక్షన్స్.. కానీ !

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు తాజాగా నటించిన సినిమా కన్నప్ప. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా... మిక్స్డ్ టాక్

కన్నప్ప కు షాకింగ్ కలెక్షన్స్.. కానీ !
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు తాజాగా నటించిన సినిమా కన్నప్ప. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా... మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. గత వారం రిలీజ్ అయిన... కన్నప్ప సినిమా గడిచిన నాలుగు రోజుల్లో 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్.. రాబట్టినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. తొలి రెండు రోజులు... మంచు విష్ణు సినిమా కన్నప్పకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.

కానీ ఆ తర్వాత రెండు రోజులు.. ఆదివారం అలాగే సోమవారం ఈ సినిమాకు తక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే 40 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా.. ఆ తర్వాత డల్ అయింది. 200 కోట్లతో తీసిన ఈ సినిమా.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది ఇలా ఉండగా... మంచు విష్ణు హీరోగా చేసిన కన్నప్ప సినిమాలో ప్రభాస్, మోహన్ బాబు, కాజల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి చాలామంది నటీనటులు ఉన్నారు. కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఇలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది.

Next Story