Preethi Mukundan: మరో బంపర్ ఆఫర్ అందుకున్న ‘కన్నప్ప’ హీరోయిన్.. ఈ స్పీడ్ మామూలుగా లేదుగా అంటున్న ఫ్యాన్స్

by Chukka Sudharani |

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే.. భారీ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో హీరోయిన్‌గా యాక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్.

Preethi Mukundan: మరో బంపర్ ఆఫర్ అందుకున్న ‘కన్నప్ప’ హీరోయిన్.. ఈ స్పీడ్ మామూలుగా లేదుగా అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే.. భారీ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో హీరోయిన్‌గా యాక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్. ఇప్పుడు ఈ అమ్మడు వరుస ఆఫర్లు అందుకుంటున్న సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ మూవీలో ప్రీతి హీరోయిన్‌గా ఆఫర్ అందుకుంది. అఖిల్ సత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ తాజాగా మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ మళ్లీ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ప్రదీప్ అసిస్టెంట్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తుండగా.. AGS నిర్మిస్తోంది. ఇందులో అర్జున్ సరసన అభిరామి జతకట్టనుండగా.. అతని కూతురు పాత్రలో ప్రీతి ముకుందన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇది తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తుండగా.. ఇందులో ప్రీతి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండగా.. కెరీర్ స్టార్టింగ్‌లోనే స్టార్ హీరోల సినిమాల్లో చాన్సులు అందుకుంటుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. లింక్

Next Story