- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేను చేసింది రెండు రోజులే అయినా అద్భుతంగా అనిపించింది.. ‘పెద్ది’ సినిమాపై స్టార్ హీరో కామెంట్స్

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi). బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి ‘పెద్ది’పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ కాగా.. గ్లింప్స్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. అయితే.. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన ఇటీవల హైదరాబాద్‌లో సందడి చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘పెద్ది’ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘45 ది మూవీ’. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కన్నడ ఇండస్ట్రీలో అతి పెద్ద మల్టీస్టారర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఈ భారీ ప్రాజెక్ట్ హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్-15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ ప్రచారకార్యక్రమంలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివరాజ్ కుమార్ ‘పెద్ది’ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను ‘పెద్ది’లో రెండు రోజులు మాత్రమే పనిచేశాను. కానీ ఆ రెండు రోజులు చాలా అందంగా అండ్ అద్భుతంగా ఉన్నాయి. నేను నా మొదటి తెలుగు డైలాగ్ చెప్పినప్పుడు వర్షం పడింది.. అది ఒక ప్రత్యేక స్వాగతంలా అనిపించింది. పెద్ది ఫస్ట్ షాట్ అద్భుతంగా వచ్చింది. రామ్ చరణ్ అద్భుతమైన వ్యక్తి.. అతను అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చారు.