- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ కోసం కన్నడ స్టార్.. RC16పై క్రేజ్ మామూలుగా లేదుగా!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రీసెంట్‌గా ‘గేమ్ చేంజర్’(Game changer) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రీసెంట్‌గా ‘గేమ్ చేంజర్’(Game changer) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజై సక్సెస్ అందుకుంది. ఇక ఈ మూవీ అనంతరం రామ్ చరణ్ ‘ఉప్పెన’ (Uppena)ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు(Director Buchi Babu) సానాతో జతకట్టిన విషయం తెలిసిందే. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయింది.
ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘మీర్జాపూర్’ (Mirzapur)వెబ్ సిరీస్‌లో మున్నాభాయ్యగా నటించిన స్టార్ నటుడు దివ్యేందు శర్మ(Divyendu Sharma) కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు చిత్రంలో మరో స్టార్ హీరో భాగం అయినట్టు ఫిలిమ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఇందులో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ (Shivraj Kumar) ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దీనిపై త్వరలో మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నట్లు టాక్. కాగా.. ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.






