- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమల్ హాసన్ గారు.. అత్యాచారాలను ఆపేందుకు సొల్యూషన్ చెప్పమంటే.. రేపిస్ట్‌ల తప్పు లేదు.. మహాభారతం తప్పంటారేంటి..?
కమల్ హాసన్ కెరీర్‌లో దూసుకుపోయినా.. లోకనాయకుడు, సూపర్ స్టార్‌గా బిరుదులు పొందినా.. హిందుత్వం గురించి వచ్చేసరికి మాత్రం ఎప్పుడూ నెగెటివ్‌గానే మాట్లాడుతారు. దశావతారం లాంటి సినిమా తీసిన ఆయనకు భారతీయ పురాణాలు అంటే ఎప్పుడూ చులకనే.

దిశ, వెబ్ డెస్క్ : కమల్ హాసన్ కెరీర్‌లో దూసుకుపోయినా.. లోకనాయకుడు, సూపర్ స్టార్‌గా బిరుదులు పొందినా.. హిందుత్వం గురించి వచ్చేసరికి మాత్రం ఎప్పుడూ నెగెటివ్‌గానే మాట్లాడుతారు. దశావతారం లాంటి సినిమా తీసిన ఆయనకు భారతీయ పురాణాలు అంటే ఎప్పుడూ చులకనే. ఈ మధ్య హీరో సూర్య ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ చేసి ట్రోలింగ్ ఎదుర్కొన్న ఆయన.. ఇప్పుడు ఓ ఓల్డ్ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు బూతులు తిడుతున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. క్లిపింగ్‌లో యాంకర్ ఎన్ని చట్టాలు తెచ్చినా అమ్మాయిలపై అత్యాచారాలు ఆగడం లేదు.. దీనికి ఒక సొల్యూషన్ చెప్పండని అడుగుతుంది. దీనికి కమల్ హాసన్.. రేపిస్టులను బ్లేమ్ చేయడం సరికాదు.. పవిత్రంగా భావిస్తున్న మహాభారతం ఇలాంటివి చేయమని ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు పొట్టు పొట్టు వేసుకుంటున్నారు. మహాభారతం, రామాయణంలో రేపిస్టులను ప్రోత్సహించినట్లుగా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఏ ఇతిహాసంలోనైనా తప్పు చేసిన వాడిని శిక్షించడమే ఉందని గట్టిగా సమాధానమిస్తున్నారు.






